Popular Posts

Friday, January 20, 2012

ప్రస్తుతానికి తప్పదు

నా పక్కనే ఉన్నాయ్ చాల కాగితాలు..చాల జ్ఞాపకాలు
నా చెంతనే ఉన్నాయ్ చాల వేదనలు చాల రోదనలు
నా ముందుగానే ఉన్నాయ్ ..చాల దారులు చాల గోతులు
నా పైననే ఉన్నాయ్ చాల బాధ్యతలు చాల ఉత్సుకతలు
నా కల్లమున్దున్నాయ్ చాలా దౌర్భాగ్యాలు చాల కుత్సితాలు
పారిపోవాల ....ఎదురీదాల...
కుళ్ళు పూసుకోవలా...కడిగెయ్యాల...
మనకెందుకులే అని ఊరుకోవాల
అందరు ఊరుకుంటే ఎట్లా అని నిలదీయలా
అంత ఓపిక ఉందా ..అంత సత్తువ ఉందా
అంత నిస్వార్థం ఉందా..అంత పట్టుదల ఉందా
అంత క్రమశిక్షణ ఉందా...అంత నిబద్దత ఉందా...
అంత ధైర్యం ఉందా అంత తెగువ ఉందా
అంత నిజం ఉందా..అంత సత్యం ఉందా
అంత దైన్యం ఉందా అంత క్రోధం ఉందా
..ఊరుకుందాం...ఊరికే ఉందాం..
ఇలాగే ఉందాం..ఇలాగే చాద్దాం
నువ్వెంచుకున్నావ్...నువ్వే తగిలించుకున్నావ్..
నువ్వే కావాలన్నావ్...

నీచేత్తో చేసిందే నీ జీవితం
నువ్ మెదనేసుకుందే ఈ డోలు
ఎవరు తప్పు కాదు
ఎవరిది తప్పు లేదు
అందరు మహానుభావులే


No comments: